Home » » Vaisshnav Tej Ketika Sharma Svcc LLP Movie Titled as Ranga Ranga Vaibhavamga

Vaisshnav Tej Ketika Sharma Svcc LLP Movie Titled as Ranga Ranga Vaibhavamga

 వైష్ణ‌వ్ తేజ్, కేతికా శర్మ జంటగా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’.. టైటిల్ టీజర్, ఫ‌స్ట్ లుక్‌ విడుదల. 



ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రానికి ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సోమ‌వారం ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది. 


టీజ‌ర్ గ‌మ‌నిస్తే యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య న‌డిచే బ‌ట‌ర్ ఫ్లై కిస్ థియ‌రీ కొత్త‌గా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రానికి శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.



Share this article :