Home » » Tremendous Response for Raavanalanka Movie in Amazon Prime

Tremendous Response for Raavanalanka Movie in Amazon Prime

 అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'రావణలంక' చిత్రానికి అద్భుతమైన స్పందన..



కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా నటించారు ఈ సినిమాలో. సీనియర్ నటులు ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను నవంబర్ 19న థియేటర్స్ లో విడుదల చేశారు. 150 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. 3.5 రేటింగ్ తో అందరి మనసులు దోచుకుంది రావణ లంక. జనవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదలైంది. దీనికి అక్కడ అద్భుతమైన స్పందన వస్తోంది. పెద్ద సినిమాలకు పోటీగా రావణలంక సినిమాకు అక్కడ విశేషమైన రెస్పాన్స్ వస్తుంది.

సంక్రాంతికి అమెజాన్ ప్రైమ్ లో రావణ లంక సినిమాను ఎంతోమంది ప్రేక్షకులను వీక్షించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నటనకు హీరో క్రిష్ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ సినిమాను క్రిష్ బండిపల్లి ఎంతో కష్టపడి నిర్మించారు. వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ సినిమాను క్రిష్ స్వయంగా నిర్మించారు. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి చేశారు. డైరెక్టర్ కష్టం తెరమీద కనిపిస్తుంది. చాలా లోకేషన్స్ లో ఈ సినిమా తీశారు. హిమాలయాలల్లో కొన్ని అద్భుతమైన సీన్స్ తెరకెక్కించారు. అలాగే బ్యాంకాక్, వైజాగ్ లో రిచ్ గా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు నిర్మాత క్రిష్. ఇప్పుడు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాకు 8.9 రేటింగ్ వచ్చింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసి ఇప్పటికే ఆ హీరోకి మరో రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది.


న‌టీన‌ట‌లు - క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు


బ్యాన‌ర్ - కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్ట‌రీ

డైరెక్ట‌ర్ - బిఎన్ఎస్ రాజు

నిర్మాత - క్రిష్ బండిపల్లి

మ్యూజిక్ - ఉజ్జ‌ల్

సినిమాటోగ్రఫి - హ‌జ‌ర‌త్ షేక్ (వ‌లి)

ఎడిటర్ - వినోద్ అద్వ‌య్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

కో డైరెక్ట‌ర్ - ప్ర‌సాద్


Share this article :