Home » » Tremendous Response for Jayaho Indians Anthem

Tremendous Response for Jayaho Indians Anthem

 గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘జయహో ఇండియన్స్’ నుంచి విడుదలైన ఆంథమ్‌కు అనూహ్య స్పందన..ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా హీరో లుక్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ విడుదలైంది. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:

రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముక్తార్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి..


టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి

నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్

నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి

సంగీతం: సురేష్ బొబ్బిలి

సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ళపల్లి

సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

గాత్రం: యాజిన్ నిజార్

లిరిక్స్: కాసర్ల శ్యామ్

VFX: విరించి ప్రొడక్షన్స్

ఆర్ట్: మోహన్, నాగు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే


Share this article :