Home » » Prabhas Crowned Top Global Asian Celebrity For 2021

Prabhas Crowned Top Global Asian Celebrity For 2021

 నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ మరో అరుదైన ఘనత..బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్ తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు ప్రభాస్. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. సౌత్ లో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ఈయన ఎంపికయ్యారు. UK దేశపు ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు. 

మీడియాతో పాటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ప్రముఖులను వాళ్ళు ఎంపిక చేశారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన దరిదాపుల్లోకి కూడా మరో హీరో రాలేకపోయారు. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ.. మార్కెట్ పరంగా తనకు తిరుగు లేదు అనే స్థాయికి ఎదుగుతున్నారు ప్రభాస్. ఒక్కో సినిమాతో తన స్థాయి పెంచుకుంటున్నారు. ఈయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటున్నాయి. 

రొటీన్ కాకుండా సినిమా సినిమాకు విభిన్నంగా ఉండేలా కథలు ఎంచుకుంటూ వరస సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్.. ఓం రౌత్ ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈయన సాధించిన ఘనతతో సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కురుస్తోంది.


Share this article :