థియేటర్స్ లో షకలక శంకర్ 'కార్పొరేటర్' మంచి ఆదరణ !!!
స్టార్ కమెడియన్ షకలక శంకర్ నటించిన 'కార్పొరేటర్' సినిమా నవంబర్ 26న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 'సంజయ్ పూనూరి'ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్ బ్యానర్ పై డాక్టర్ ఎస్.వి.మాధురి నిర్మించిన ఈ సినిమా దాదాపు 200 థియేటర్స్ లో విడుదలయ్యింది.
కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు - 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంది. శంకర్ డైలాగ్స్ కు కామెడీ కి థియేటర్స్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని ఏరియస్ లో హౌస్ ఫుల్స్ అవుతున్నాయని దర్శకుడు సంజయ్ పూనూరి తెలియజేసారు.
శంకర్ పెర్ఫార్మెన్స్ తో పాటు పాటలు, ఫైట్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ 'కార్పొరేటర్' సినిమా కు మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందని నిర్మాత డాక్టర్ ఎస్.వి.మాధురి అన్నారు. సినిమాను థియేటర్స్ కు వచ్చి వీక్షించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Post a Comment