Aadi SaiKumar Black Ready for Release

 ఆది సాయి కుమార్ నటించిన బ్లాక్ చిత్రం త్వరలోనే విడుదల 



మహంకాళి మూవీస్ పతాకం పై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". దీపావళి పండగ సందర్భంగా  తెలుగు ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం యొక్క రెండవ పోస్టర్ ను విడుదల చేసారు. ఇటీవలి విడుదలైన టీజర్ తో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. హీరో అది కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక మైలు రాయిగా నిలుస్తుంది. మంచి సాంకేతిక విలువలతో నిర్మించబడిన చిత్రం త్వరలోనే విడుదల కు సిద్ధం అవుతుంది. 


ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు. 


ఈ చిత్రానికి


 సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల 

సంగీతం : సురేష్ బొబ్బిలి 

ఎడిటింగ్ : అమర్ రెడ్డి 

ఫైట్స్ : రామకృష్ణ 

ఆర్ట్ : కె వి రమణ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్ 

నిర్మాత : మహంకాళి దివాకర్ 

రచన - దర్శకత్వం : జి బి  కృష్ణ

Post a Comment

Previous Post Next Post