Home » » Olikipoyina Vennela Novel Launched by K Raghavendra Rao

Olikipoyina Vennela Novel Launched by K Raghavendra Rao




 దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా "ఒలికిపోయిన వెన్నెల" నవల ఆవిష్కరణ


తెలుగు ఇండస్ట్రీ లో  ఘన విజయం సాధించిన  చూడాలని వుంది,శుభలగ్నం, మావిచిగురు, యమలీల  మొదలైన సుమారు వంద చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు శ్రీ దివాకర బాబు మాడభూషి. తనకున్న అనుభవంతో శ్రీ దివాకర బాబు మాడభూషి రాసినటువంటి ఒలికిపోయిన వెన్నెల నవల ఈరోజు సినీ మ్యాక్స్ లో ప్రముఖ దర్శకులు దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు.BA చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా


 దివాకర బాబు మాడభూషి మాట్లాడుతూ ..వెన్నెల చాలా హాయిగా అందరికి ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ ఆ వెన్నెల ఒలికిపోతే ఎవరికి అవసరం లేదు. ఎవరూ దాన్ని ఎత్తుకుని దోసిళ్లలోకి తీసుకోలేరు అనే పాయింటును ఒక స్త్రీ పరంగా చెబుతూ, ఒక స్త్రీ యొక్క అంతరంగ మథనాన్ని ఈ ఒలికి పోయిన వెన్నెల నవలలో ఆవిష్కరించడం జరిగింది. దర్శకేంద్రుడు ఎంతో బిజీగా ఉన్నాకూడా మా విన్నపాన్ని మన్నించి నేను రాసిన "ఒలికిపోయిన వెన్నెల" నవల ను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అని అన్నారు


Share this article :