Nikhil Siddharth 18pages Dubbing Started

 నిఖిల్ సిద్ధార్థ్,అనుపమ పరమేశ్వరన్ ‘18 పేజెస్’ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు..



వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్య



క్రమాలు మొదలయ్యాయి. హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన డబ్బింగ్ మొదలు పెట్టారు. ఓ వైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్

కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్

నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫర్: ఏ వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: గోపీ సుందర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Post a Comment

Previous Post Next Post