ఓటిటిలో తెరకోసం వేషాలు సినిమా విడుదల"
పెద్ద సినిమాల బాటలోనే ఓటిటి లో తెర కోసం వేషాలు సినిమా విడుదల.
"తెర కోసం వేశాలు " చిత్రం జూలై 28న ఓటిటి లో విడుదలైనది. ఈ సినిమా గురించి చిత్ర కథా రచయిత జీవన్ మాట్లాడుతూ ,ప్రేక్షక దేవుళ్ళకు ఒక కొత్త అనుభూతి కలగాలని కొత్తగా ఈ యొక్క మూఖీ చిత్రం తీయడం జరిగింది. సింహ భాగం మూఖీగా చిత్రం నడుస్తుంది . ఒక రియాల్టీ షోని చిత్రంగా మార్చి ,నటీనటులతో ఎంతో ఇష్టపడి,కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మా దర్శకనిర్మాతలు అని రచయిత చెప్పుకొచ్చారు.
చిత్ర నిర్మాత అయిన శ్రీనుసునీల్ మాట్లాడుతూ ఒక చిన్న స్టోరీలైన్నీ అద్భుతంగ, రియాల్టీ షోగా మలిచి ,వెబ్ సిరీస్ అని మొదటగా ప్లాన్ చేసాం , కానీ ఈ యొక్క చిత్రం ప్రతి ప్రేక్షకుడికి త్వరగా చేరాలని ,సినిమాగ మార్చడం జరిగింది.
ఈ చిత్రంలో కరోనా వ్యాధికి సంబంధించి ఒక చక్కటి మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలు తర్వతా ఒక మూఖీ మన ముందుకి సినిమా రాబోతుంది, ప్రతి ప్రేక్షకుడు ఒక చక్కటి అనుభూతిని పొందుతాడిని మనస్ఫూర్తిగా మా టీం అందరం నమ్ముతున్నాం. మొదటి ప్రయత్నం ,కాస్త ఇబ్బందులు పడ్డాం,అయినా బాగానే చేశాం అని అనుకుంటున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని అశ్విరదించాలని పేరు పేరున కోరుకుంటున్నాము. MX player app ద్వారా ఓటిటి
లో ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించవచ్చు . అని చిత్ర నిర్మాత చెప్పారు .
ఛాయాగ్రహణం : క్రాంతి నీల
ఎడిటింగ్ : సత్య
సంగీతం : VRA ప్రదీప్
నిర్మాత : శ్రీనుసునీల్
డైరెక్షన్ : దివ్య మనోజ్ శంబు .
Post a Comment