SR కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ స్టోరీ..
తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలుపుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేసారు కిరణ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు ఈ కుర్ర హీరో. సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చారు ఈయన. తెలుగు ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు కిరణ్.
తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనేది తన డ్రీమ్ అంటున్నారు కిరణ్ అబ్బవరం. జులై 15న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ‘SR కళ్యాణమండపం’ సినిమా గ్లింప్స్ జులై 14న విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా పోస్టర్ జులై 14 సాయంత్రం 5.30 నిమిషాలకు విడుదల కానుంది. జులై 15 ఉదయం 10.05 నిమిషాలకు ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు కిరణ్ అబ్బవరం 5వ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుంది. ఈ మేరకు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.