ఎనర్జిటిక్ హీరో నిఖిల్, క్రియోటివ్ డైరక్టర్ సుకుమార్, అల్లుఅరవింద్, బన్నివాసు, సూర్య ప్రతాప్ కాంబినేషన్ లో 18 పేజీస్ ప్రీలుక్ కి విశేష స్పందన
అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్స్ హిట్ తరువాత యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ జంటగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 18 పేజీస్. మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 పర్సెంట్, భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూపండుగే వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో సక్సస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన యంగ్ నిర్మాత బన్నివాసు నిర్మాతగా జీఏ2పిక్చర్స్ మరియు ఉప్పెన వంటి సన్సెషేనల్ హిట్ అందుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల అనూహ్య స్పందన లభించింది, అలానే స్టార్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, నిఖిల్ - అనుపమ కాంబినేషన్, జీఏ2 పిక్చర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెరసి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అందరి అసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజీస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 18 పేజీస్ ప్రీ లుక్ విడుదల చేశారు, నిఖిల్ కల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్రస్తుతం ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
సమర్పణ - అల్లు అరవింద్బ్యానర్ - జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్కథ, స్క్రీన్ ప్లే - సుకుమార్డైరెక్టర్ - పల్నాటిసూర్య ప్రతాప్నిర్మాత - బన్నీ వాస్మ్యూజిక్ డైరెక్టర్ - గోపీసుందర్లైన్ ప్రొడ్యూసర్ - బాబుకెమెరా - వసంత్ఎడిటర్ - నవీన్ నూలీరచన - శ్రీకాంత్ విస్సాఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూసర్ - శరణ్ రాపర్తి, అశోక్ బికో డైరెక్టర్ - రాధా గోపాల్పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
Post a Comment