Shukra streaming on Amazon Prime



 ఆమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న "శుక్ర"


ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన చివరి సినిమా "శుక్ర". మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. "శుక్ర" సినిమాలో అరవింద్ కృష్ణ, కొత్త అమ్మాయి శ్రీజితా ఘోష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి చిత్రంతో దర్శకుడిగా మెప్పించారు సుకు పూర్వజ్. 


నిర్మాతలు అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె లకు లాభాలు తెచ్చిపెట్టిన "శుక్ర" తాజాగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది "శుక్ర". థియేటర్లలో ఈ యూత్ ఫుల్ థ్రిల్లర్ ను  మిస్ అయిన వారు అమోజాన్ లో చూసి ఎంజాయ్ చేయమని చిత్ర బృందం ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తోంది.

Post a Comment

Previous Post Next Post