Home » » Bazaar Rowdy Second Song Launched

Bazaar Rowdy Second Song Launched



పిల్లా నా మ‌తి చెడగొట్టావే అంటూ డ్యూయ‌ట్ వేసుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు


అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న "బ‌జార్‌ రౌడి" రెండ‌వ సాంగ్


వరుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఆసాధ్యాన్ని  సాధ్యం చేసిన‌  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమా కి సంబందించి రెండ‌వ సాంగ్ ని విడుద‌ల చేసారు.  నీ వంటికి మోరుపులు బాగా చుట్టేశావే..నా కంటికి ఏవో రంగులు చూపించావే..పిల్లా నా మ‌తి చెడ‌గోట్టావే .. వ‌ద్ద‌న్నా న‌ను ప‌డ‌గోట్టావే.. అంటూ  సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్ది తో డ్యూయ‌ట్  పాడుకుంటున్నాడు.  ఈ సాంగ్ కి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేఖమైన స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొద‌టి  రెండు సాంగ్స్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్ర టీజ‌ర్ కి 2 మిలియ‌న్ వ్యూస్ ని సోష‌ల్ మీడియాలో సొంతం చేసుకుంది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు.  ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ  చిత్రాన్ని చాలా బాగా కుదించారు.  SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ఈ బ‌జార్‌ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.

న‌టీ న‌టులు..

బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు

నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు

మాట‌లు: మ‌రుధూరి రాజా

సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌

సంగీతం: సాయి కార్తిక్‌

ఎడిటర్: గౌతం రాజు

ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా

కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌

మేక‌ప్‌: శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి

కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌ 


Share this article :