శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా వస్తున్న కొత్త చిత్రం..!!
శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై బేబీ లాలిత్య సమర్పణలో ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా , శివ కేశనకుర్తి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 3 గా వస్తున్న కొత్త చిత్రం పూజ కార్యక్రమాలతో నేడు ఘనంగా ప్రారంభమయ్యింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో అంగారగంగా వైభవం గా జరిగింది. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవుతున్నారు..
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ కి చెందిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవుతున్నారు.. ఈ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత గారికి కృతజ్ఞతలు. పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అందరికి నచ్చేలా తెరకెక్కిస్తానని చెప్పారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు అన్నారు..
నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలా బాగుంది..రెగ్యులర్ సినిమా లా కాకుండా వెరైటీ గా ఉండడంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.. మే 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నాం.. మా బ్యానర్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది.. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవడం ఎంతో ఆనందంగా ఉంది. అందరికి ఉగాది శుభాకాంక్షలు అన్నారు.
హీరో శరన్ మాట్లాడుతూ.. ఇంతమంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నేను హీరో గా పరిచయమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా స్టోరీ ఎంతో బాగుంది. మీ అందరికి నచ్చుతుంది.. త్వరలోనే ఓ మంచి సినిమా తో మీముందుకు వస్తాను అని అన్నారు..
Post a Comment