Shukra Releasing on April 23



ఉగాది పర్వదినం సందర్భంగా "శుక్ర" ట్రైలర్ విడుదల, ఏప్రిల్‌ 23న సినిమా రిలీజ్


మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ "శుక్ర". సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉదయం 10.30 గంటలకు "శుక్ర" సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 

ట్రైలర్ చూస్తే....వరుస నేరాలతో విశాఖ నగరం ఉలిక్కి పడింది అనే వార్తలతో ట్రైలర్ ప్రారంభమైంది. న్యూ కపుల్ గా అరవింద్ కృష్ణ, శ్రీజిత కనిపించారు. ప్రైవసీకి టైమ్ లేనంత బిజీలో ఉన్న ఈ జంట సరదా పార్టీకి వెళ్తారు. ఆ పార్టీ లో కొన్ని అనుకోని ఘటనలు జరిగినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. ఒక వైపు మాఫియా నేరాలు, మరోవైపుఈ జంట జీవితాల్లోని అనూహ్య మలుపులు చూడొచ్చు. అవకాశం ఉంది కదా అని ఆకాశాన్ని తాకాలని చూస్తే ఆ తర్వాత నేల నాకాల్సి ఉంటుంది. అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ కంప్లీట్ అయింది.*


"శుక్ర" సినిమా ఏప్రిల్ 23 న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్ కి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.


అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం ఆశీర్వాద్, రచన-దర్శకత్వం సుకు పూర్వజ్.

Post a Comment

Previous Post Next Post