తలసాని చేతుల మీదుగా ఎర్రచీర టీజర్ విడుదల
డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి లు జంటగా నటిస్తూ శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్ వంటి నటీనటులతో తెరకెక్కుతున్న తలసాని చేతుల మీదుగా ఎర్రచీర టీజర్ విడుదల అయింది.
టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కథ తో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ఎర్రచీర. ఈ సినిమాలో సుమన్ బాబు అండ్ కారుణ్య చౌదరిలు జంటగా నటిస్తుండగా, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని, వంటి తదితర తారాగణం నటిస్తున్న ఈ ఎర్రచీర టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ..ఎర్ర చీర ట్రైలర్ నీ విడుదల చేసినందుకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారికి ధన్యవాదాలు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి, ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ ట్రైలర్ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కవొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
నటీనటులు:
సుమన్ బాబు అండ్ కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బేబీ సాయి తేజేస్విని తదితర తారాగణం
ఈ సినిమాకు మాటలు గోపి విమలపుత్ర,
కథ స్క్రిన్ ప్లే దర్శకత్వం సత్య సుమన్ బాబు.