ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న ప్లాన్ బి
శ్రీనివాస్ రెడ్డి హీరో గా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "ప్లాన్-బి". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 23 న విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగె కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠం గా ఉంటుంది.
మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.
నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తీ అయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఈ సినిమా విడుదల కి ముందే మా దర్శకుడికి మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నాం." అని తెలిపారు.
సినిమా పేరు : ప్లాన్ బి
బ్యానర్ : ఎవిఆర్ మూవీ వండర్స్
నటి నటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని, తదితరులు
కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్)
ఎడిటర్ : ఆవుల వెంకటేష్
యాక్షన్ : శంకర్ ఉయ్యాల
ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్
ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి
డిటియస్ : రాధాకృష్ణ
డిఐ కలరిస్ట్ : ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్)
సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె
పిఆరోఓ : పాల్ పవన్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : కెవి రాజమహి
నిర్మాత : ఎవిఆర్.