Home » » Naresh Ali Andaru Bagundali Andulo Nenundali 90 percent Shoot Completed

Naresh Ali Andaru Bagundali Andulo Nenundali 90 percent Shoot Completed

 


నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.  అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది. 1100 సినిమాల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర  నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో...’’ అంటూ సాగే పాటను ఆరు రోజులపాటు కాశ్మీర్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్‌ చేశారు. ఈ సినిమాలోని అన్ని పాటలను ప్రముఖ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ రచించటం విశేషం. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.  నరేశ్‌ సరసన పవిత్ర లోకేశ్, అలీకి జంటగా మౌర్యాని నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు.  షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ చానల్‌ శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకోవటంతో సినిమా టీమ్‌ ఆనందంతో ఉంది.  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌  కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడియో


Share this article :