Home » » Allu Arjun to Grace Chavu Kaburu challaga Pre Release Event

Allu Arjun to Grace Chavu Kaburu challaga Pre Release Event

 



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా మార్చి 9న జీఏ2 పిక్చ‌ర్స్ - చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్


మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ఇప్పటికే విడుదలైన పబ్లిసిటీ కంటెంట్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 9న జ‌ర‌గ‌బోతున్న చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత బ‌న్నీవాసు ప్ర‌క‌టించారు. అభిమానుల్ని ప్రొత్స‌హించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందుండే స్టైలిష్ట్ స్టార్ అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చావు క‌బ‌రు చ‌ల్ల‌గా టీమ్ కోసం త‌న‌ స‌మ‌యాన్ని ఇచ్చి  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా రావ‌డానికి అంగీక‌రించ‌నందుకు చాలా ఆనందంగా ఉన్న‌ట్లుగా చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. మార్చి 9న హైద‌రాబాద్ జేఆర్ సి ఫంక్ష‌న్ హ‌ల్ లో భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని అన్నారు నిర్మాత బ‌న్నీవాసు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 19న విడుద‌ల అవ్వ‌నుంది. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.


నటీనటులు..


కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు


సాంకేతిక వ‌ర్గం..


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్

బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్

నిర్మాత - బ‌న్నీ వాసు

దర్శకుడు - కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

ఎడిట‌ర్‌- స‌త్య జి

ఆర్ట్‌ - జి ఎమ్ శేఖ‌ర్‌

మ్యూజిక్ - జేక్స్‌ బిజాయ్

సినిమాటోగ్రాఫ‌ర్ - క‌ర‌మ్ ఛావ్లా

అడిషిన‌ల్ డైలాగ్స్ - శివ కుమార్ భూజుల‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ - రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు

పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరిక‌ల్ వీడియోస్ - క్రేజీ షౌట్

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ - మ‌నిషా ఏ ద‌త్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - మౌనా గుమ్మ‌డి


Share this article :