ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 26 న "MMOF ఉరఫ్ 70 MM" విడుదల
శ్రీమతి అనుశ్రీ ప్రజెంట్ ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై జె డి చక్రవర్తి హీరోగా ఎన్.ఎస్ సి దర్శకత్వంలో రాజశేఖర్ ,ఖాసీం లు నిర్మిస్తున్న చిత్రం యమ్.యమ్.ఓ.యఫ్. ఉరఫ్ 70 యమ్. యమ్. ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా
*జెడి చక్రవర్తి మాట్లాడుతూ* ..యమ్. యమ్. ఓ.యఫ్ టైటిల్ని తీసివేయమని అందరూ అడుగుతున్నారు. ఈ టైటిల్ కు అర్థం ఏంటనేది విడుదలకు ముందు తెలియజేద్దాం అని ఆగాము. ఇది పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. కరోనా రావడం వల్ల సినిమా లేట్ అయినా ప్రొడ్యూసర్లకు ఓ.టి.టి ల వలన మంచి జరగుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతలు ఈ చిత్రం కోసం భారాన్ని మించిన బరువులు మోశారు..యమ్. యమ్. ఓ.యఫ్ అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు. ఈనెల 26న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
*నిర్మాతలు రాజశేఖర్ ,ఖాసీం లు మాట్లాడుతూ..* యమ్. యమ్. ఓ.యఫ్ మర్డర్ మిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ,మనీ మనీ ఆఫ్ ఫ్రెండా అని చాలామంది టైటిల్ గురించి ఫోన్ చేసి అడుగు తున్నారు.అందరి డౌట్స్ జె.డి గారు క్లియర్ చేసి యమ్. ఓ.యఫ్ అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు అన్నారు.ఈ నెల 26న విడుదల అవుతుంది ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు
*నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..* ఈ సినిమా ట్రైలర్ ను చూసి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఒక నిర్మాత అయినా సినిమా ట్రైలర్ నచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చాను. ఒక సినిమా
ప్రేక్షకులను థియేటర్ దగ్గరికి తీసుకొచ్చేది టైటిల్ మాత్రమే, అలా వచ్చిన ప్రేక్షకులు సినిమా బాగుంటే పదిమందికి చెప్పి చిత్రాన్ని సూపర్ హిట్ చేస్తారు.ఈ చిత్రం కోసం దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. తాజ్ మహల్ కట్టడానికి అప్పట్లో ఎంత మంది కష్టపడ్డారో అలాగే ఈ సినిమాను కూడా దర్శక నిర్మాతలు తాజ్ మహల్ లా తీర్చిదిద్దారు. సినిమా బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయారు. టైటిల్ పై నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది జె.డి చక్రవర్తి గారు నాకున్న కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసి యమ్. ఓ.యఫ్ అనేది రిఫ్లెక్షన్ లో వస్తే 70mm సినిమా పేరు అన్నారు.70mm టైటిల్ చాలా బాగుంది. కొత్తవారితో తీసిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ బాయ్ 100 కోట్ల కలెక్షన్ చేస్తుంది చేసింది. ఆ సినిమా లాగే ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించాలని అన్నారు.
*నటీనటులు*
జె.డి చక్రవర్తి, బెనర్జీ ,కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర అక్షిత ముద్గల్ అక్షత శ్రీనివాస్
టార్జాన్,మనోజ్ నందన్, శ్రీ రామచంద్ర , రాజీవ్
*సాంకేతిక నిపుణులు*
టైటిల్.. యమ్. యమ్. ఓ.యఫ్
ప్రెసెంట్స్.. శ్రీమతి అనుశ్రీ
ప్రొడ్యూసర్స్.. రాజ శేఖర్, ఖాసీం
దర్శకత్వం ..ఎన్ యస్.సి
మ్యూజిక్.. సాయి కార్తీక్
పి.ఆర్.ఓ..ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
కెమెరామెన్.. అంజి
డైలాగ్స్.. రాఘవ
ఎడిటర్.. ఆవుల వెంకటేష్
కో-ప్రొడ్యూసర్స్ ..బండి శివ, గుడిపాటి రవి