Kennedy Club 2020 Releasing soon

 


సంక్రాంతి శుభాకాంక్షలతో కెన్నడీ క్లబ్ ఫస్ట్ లుక్ విడుదల 


శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో సుశీంద్రన్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత  డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం యొక్కఫస్ట్ లుక్ పోస్టర్  ను పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో విడుదల చేసారు. ఇది పల్లేటూరి నేపధ్యం లో కబడ్డీ క్రీడ సినిమా . 



ఈ సందర్భం గా నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "సుశీంద్రన్ దర్శకత్వం లో కబడ్డీ క్రీడ నేపథ్యం లో నిర్మించిన  చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం తమిళం లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇది పల్లేటూరి నేపథ్యంలో సాగే కబడ్డీ ఆట. సుశీంద్రన్ గారు అద్భుతంగా తెరకేకించారు. తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది . అందుకే మా  అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై తెలుగులో విడుదల చేయటానికి సంకల్పించాం ఫిబ్రవరి లో విడుదల చేయాలనుకుంటున్నాము. సంక్రాతి పండగ సందర్భంగా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post