బుల్లెట్ సత్యం ట్రైలర్ లాంచ్
సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేవ్‌రాజ్, సొనాక్షి వర్మ, మోనా ఠాకూర్ జంటగా నటించిన మూవీ బుల్లెట్ సత్యం. మధు గోపు దర్శకత్వంలో పోతూరి పవిత్ర నిర్మించిన బుల్లెట్ సత్యం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు వి.వి వినాయక్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా వి.వి వినాయక్ బుల్లెట్ సత్యం టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించి, సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. కొత్త నటీనటులు, దర్శక నిర్మాతలను ఆశీర్వదించాలని కోరుకున్నారు.
చలాకీ చంటి మాట్లాడుతూ.. “ అడగ్గానే చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడానికి అంగీకరించిన దర్శకులు వి.వి వినాయక్ గారికి కృతజ్ఞతలు, బుల్లెట్ సత్యం మూవీ గొప్ప సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
గీతరచయిత రాంబాబు గోషాల మాట్లాడుతూ.. “ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసిన వి.వి వినాయక్ గారికి కృతజ్ఞతలు.. బుల్లెట్ సత్యం టీమ్‌కు ఆల్‌ది బెస్ట్.. ఈ మూవీ నుంచి ఆల్‌రెడీ రామసక్కని రామసిలక అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట 3 రోజుల్లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. పాటటను ఆదరించినట్టే సినిమాను కూడా ఆదరించాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఎడిటర్ ఉద్దవ్ మాట్లాడుతూ..'' బుల్లెట్ సత్యం ట్రైలర్‌ను లాంచ్ చేసిన వి.వి వినాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు.
బుల్లెట్ సత్యం చిత్ర హీరో హీరోయిన్లు దేవ్‌రాజ్, సొనాక్షి వర్మ కాగా.. మిగతా పాత్రల్లో వినోద్ కుమార్, చలాకి చంటి, ధన్‌రాజ్, అప్పారావు, సత్తెన్న, శివలీల, వాసు మోనాథాకూర్, రాకేష్, సంజయ్ రెడ్డి, చేతన్ తదితరులు నటించారు.
డైరెక్టర్ మధు గోపు మాట్లాడుతూ.. “ ఈరోజు మా బుల్లెట్ సత్యం ట్రైలర్‌ను వి.వి వినాయక్ గారు రిలీజ్ చేసారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం బుల్లెట్ సత్యం టీమ్ అంతా సంతోషంగా వున్నాం " అని చెప్పారు.
హీరో దేవ్‌రాజ్ మాట్లాడుతూ.. " ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకులు వి.వి వినాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు , ఊహించిన దానికంటే సినిమా బాగా వచ్చింది. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఈచిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని" చెప్పారు.
బుల్లెట్ సత్యం హీరో హీరోయిన్స్ దేవ్‌రాజ్, సొనాక్షి వర్మ, మోనాఠాకూర్, వినోద్ కుమార్, చలాకీ చంటి, ధన్‌రాజ్, అప్పారావు, సత్తెన్న, శివలీల,వాసు, సంజయ్ రెడ్డి, రాకేష్, చేతన్ తదితరులు నటించారు.
సాంకేతిక వర్గం : మ్యూజిక్ వినోద్ యాజమాన్య, ఎడిటింగ్ ఉద్దవ్, డిఓపి జి.ఎల్ బాబు , కొరియోగ్రఫీ చంద్రకిరణ్, లిరిక్స్ రాంబాబు గోషాల, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, రచన సహకారం సంజయ్ బంగారపు, నిర్మాత పోతూరి పవిత్ర, రచన దర్శకత్వం మధు గోపు
Post a Comment