Police Complaint on Hero Ramcharan ?-Telugucinemas. in

రాంచరణ్ తేజ పై పోలీసులకు ఫిర్యాదు

మెగాస్టార్ , కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు , ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ సిటి షాపింగ్ మాల్ వద్ద దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజ్ డెక్కన్ హోటల్ వద్ద తన ఆస్టన్ మార్టిన్ కారును ఢీకొట్టడంతో చరణ్  వీరంగం సృష్టించినట్టు సమాచారం .తన కారుకు అడ్డం వచ్చారన్న కోపంతో రామ్ చరణ్, అతని కారు డ్రైవరు సెక్యూరిటీ  కలిసి మరో వ్యక్తిపైన దాడి చేశారన్నది అభియోగం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రిటిలు బయటకు వచ్చిన్పపుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లేకుంటే అనవసరంగా చిక్కులలో పడతారు 
Previous Post Next Post