Chinna Cinema completed business, ready to release for Ugadi




బిజినెస్ పూర్తి చేసుకుని ఉగాది కానుకగా ఏప్రిల్ లో విడుదలకు అవుతున్న చిన్న సినిమా
జెర్సీ ప్లాట్స్ బ్యానర్ పై అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఝా, కేథరిన్, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, బాలయ్య, సూర్య ప్రధాన పాత్రధారులుగా నిర్మించబడిన చిన్న సినిమా ఆంధ్రప్రదేశ్ మొత్తం బిజినెస్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కృష్ణా జిల్లా హక్కులని దుర్గా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ఏరియాల మొత్తం హక్కులని శ్రీ లక్ష్మి పిక్చర్స్  కైవసం చేసుకుంది. ఓవర్ సీస్ హక్కులని రైన్ బో ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్రం నిర్మాతలు శేఖర్, జ్యోతిలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమకి అన్నీ విధాలా సహకరిస్తున్న సినీ పెద్దలకు, శ్రేయాభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియచేశారు. దర్శకుడు ఎ.కె. కంభంపాటి మాట్లాడుతూ “సింపుల్ కామెడీతో నిర్మితమైన ఈ చిన్న సినిమా అన్ని వర్గాల వారిని  ఆకట్టుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు మాట్లాడుతూ “ఈ సినిమా చూశాను. కచ్చితంగా యూత్ కి బాగా నచ్చుతుంది అనే నమ్మకంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ హక్కులని కొనుగోలు చేశాను.” అని తెలియచేశారు.
ముఖ్య తారాగణం: అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఝా, కేథరిన్ వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, బాలయ్య, ఎల్. బి. శ్రీరాం, సూర్య, మహేష్ శ్రీరాముల, రఘు, సిద్దాంత్, శ్రీనివాస్ కార్తిక్, శ్రీని కొల్ల, RJ గజిని, పృథ్వి  గౌతమ్ రాజు, ప్రదీప్ శక్తి, గుండు సుదర్శన్.
సినిమాటోగ్రఫీ: హైదర్ బిలిగ్రామి (US shoot), పి.జి. విందా (India Shoot) ; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: వినయ్  రామ్; నిర్మాతలు: శేఖర్, జ్యోతి ; దర్శకుడు: ఎ.కె. కంభంపాటి

Previous Post Next Post