Teja Veyi Abadhalu Movie With Sairamshankar

తేజ 'వెయ్యి అబద్దాలు' అడనున్నడా?


ఒకప్పుడు చిన్న సినిమాలతో పెద్ద సంచలనాలు సృష్టించిన దర్శకుడు తేజ, గత కొన్నాళ్ళుగా విజయాల కోసం కరువాచిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విజయాలు మాత్రం పొందలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ నెల 18 న ఈ చిత్రం షూటింగును ప్రారంబిస్తున్నారు. ఇందులో నటించే కథానాయిక ఎవరనేది ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ, చిత్రం పేరు మాత్రం 'వెయ్యి అబద్దాలు'గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 'వెయ్యి అబద్దాలు' ఆడైనా ఓ పెళ్లి చేయాలన్నది నానుడి... మరి ఈ సినిమా కూడా అందుకు తగ్గట్టుగా, పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా? అన్నది తెలియాల్సివుంది!
.html

Post a Comment

Previous Post Next Post