జగన్ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రిం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రింకోర్టు ఆదేశం ఇచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా జగన్ బెయిల్ పై ఆశలు పెట్టుకున్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశ ఎదురైంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సిబిఐ వాదనతో ఏకీభవించి సుప్రింకోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది. జగన్ కేసు విచారణకు మరి కొంత సమయం కావాలని సిబిఐ కోరింది. దీంతో జగన్ మరికొంతకాలం చంచల్ గూడ జైలులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.జగన్ ను ఇప్పటికే నూట ముప్పై రెండు రోజులు జైలులో ఉంచారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. కాగా జగన్ ఇంత తక్కువ సమయంలో ఇన్నివేల కోట్లు ఎలా సంపాదించారని జడ్జి అల్తాప్ ప్రశ్నించగా, సిబిఐ వేల కోట్ల ఆరోపణలు చేసినా చివరికి చూపింది 74 కోట్లేనని జగన్ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. మొత్తం మీద జగన్ కు మరోసారి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.
Post a Comment