దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ చేయిచేసుకోవడం పై దర్శకుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రామ్ హీరోగా గతంలో వచ్చిన 'కందిరీగ' చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ ... బెల్లంకొండ దర్శక నిర్మాతలుగా వ్యవహరించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో, అదే కాంబినేషన్లో మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కథ సెకండాఫ్ లో ఏవో మార్పులు చేయమని దర్శకుడితో బెల్లంకొండ చెప్పాడట. అయితే హీరోతో చెప్పకుండా అలా చేయడం కుదరదని సంతోష్ అనడంతో, ఒక్కసారిగా ఆవేశపడిపోతూ అతనిపై బెల్లంకొండ చేయిచేసుకున్నాడని తెలుస్తోంది. దాంతో సంతోష్ నేరుగా వెళ్లి ఎ.పి.ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడంతో, అధ్యక్షుడు సాగర్ వెంటనే స్పందించినట్టు చెబుతున్నారు. జరిగిన సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ ... ఈసీ సమావేశంలో చర్చలు జరిపాక బెల్లంకొండ పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. |
Post a Comment