Controversy sparks over Pawan Kalyan's Costumes in Gabbar Singh police officers fire on gabbarsing 'గబ్బర్ సింగ్' పై పోలీస్ అధికారుల ఆగ్రహం !


'గబ్బర్ సింగ్' చిత్రం ఈ నెల 11 న విడుదలయ్యేందుకు ముస్తాబౌతోంది. ఎన్నో ప్రత్యేకలతో ... అంచనాలతో రానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాపై రాష్ట్ర పోలీస్ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వేష ధారణ ... అతని చేష్టలు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయనీ, అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ కి స్పందించక పోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు. పోతే, ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకి UA సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post