దర్శకుడు సంతోష్ ఫై చెయ్య చేసుకున్న నిర్మాత bellamkonda manhandled santosh srinivas

        


 ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది. పారితోషికం విషయంలో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తడంతో ఆవేశంలో శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ దాడి చేసి, కొట్టినట్టు చెబుతున్నారు. గతంలో సురేష్ ఈ దర్శకునితో 'కందిరీగ' చిత్రాన్ని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే మళ్లీ ఈ దర్శకునితోనే రామ్ హీరోగా సురేష్ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు చెందిన పారితోషికం విషయంలోనే గొడవ జరిగిందట. ఈ సంఘటనతో దర్శకుడు శ్రీనివాస్ దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన కొందరు పెద్దలు రంగ ప్రవేశం చేసి, వివాదం పెద్దది కాకుండా, ఇద్దరి మధ్యా రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాత సురేష్ గతంలో కూడా ఇలాగే కొందరిపై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Post a Comment

Previous Post Next Post