Aishwarya rai daughter name is aaradhya

ఐశ్వర్య కూతురు ఆరాధ్య!

  అందాలతార ఐశ్వర్యారాయ్ ముద్దుల తనయ పేరు విషయంలో వున్న సందిగ్దత తొలగిపోయింది. బుల్లి ఐశ్వర్య పేరు 'ఆరాధ్య' అన్న విషయాన్ని తాజాగా అమితాబ్ బచ్చన్ ద్రువీకరించాడు. ఐశ్వర్యకు కూతురు పుట్టినప్పటి నుంచీ ఆమె పేరు పట్ల రకరకాల రూమర్లు రాజ్యమేలాయి. అయితే, వాటన్నిటినీ అమితాబ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. తన మనుమరాలికి ఇంకా నామకరణం చేయలేదని చెబుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టెర్ లో ఈ పేరును ప్రకటించాడు. వాస్తవానికి గత కొంత కాలం క్రితమే బాలీవుడ్ లో ఈ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు అమితాబ్ ద్రువీకరించడంతో అనుమానాలన్నీ నివృత్తయ్యాయి!

Post a Comment

Previous Post Next Post