ఇటీవల విడుదలైన 'రచ్చ' సినిమా దర్శకుడు సంపత్ నందికి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద హీరోల నుంచి సంపత్ కు పిలుపులొస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఈ దర్శకుడితో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని వార్తలొచ్చాయి. సంపత్ చెప్పిన లైన్ ప్రభాస్ కి బాగా నచ్చిందట. దాంతో ఆ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంచితే, సంపత్ టేకింగ్ స్టయిల్ నచ్చడంతో యన్టీఆర్ కూడా అతనితో ఓ చిత్రం చేయడానికి ముందుకొచ్చాడని తెలుస్తోంది. యన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ఇప్పటికే సంపత్ రెడీ చేసాడట. వీరి కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ ప్రాజక్టును చేబడుతున్నారని టాలీవుడ్ సమాచారం. ఆమధ్య యన్టీఆర్ తో ఆయన నిర్మించిన 'శక్తి' సినిమా ఫ్లాప్ కావడంతో యన్టీఆర్ మరోసారి అశ్వనీదత్ కు డేట్స్ ఇస్తున్నాడట! |
Post a Comment