/Jr-ntr-puri-jagannath11.jpg)
/Jr-ntr-puri-jagannath11.jpg)

రాము... ఈ పేరు వినగానే నాటి యన్టీఆర్ నటించిన ఉత్తమ కుటుంబ కథా చిత్రం మన ముందు కదలాడుతుంది. అప్పట్లో అది పెద్ద సక్సెస్ అయిన చిత్రం. ఆ తర్వాత బాలకృష్ణ కూడా అదే టైటిల్ తో ఓ సినిమా చేశారు. అది కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడీ పేరు జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి కూడా టైటిల్ అవుతోంది. అవును... ఎన్టీఆర్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి 'రాము' టైటిల్ని ఖరారు చేసారని తెలుస్తోంది. పూరీ ఈ పేరు చెప్పగానే ఎన్టీఆర్ ఆనందంతో వెంటనే ఓకే చెప్పేసారని అంటున్నారు. సెప్టెంబర్ 18 న ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు. అలాగే, విడుదల తేదీని కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని విడుదల చేసేలా పూరీ ప్లాన్ చేశాడట. ఒక హిట్ టైటిల్ తో రాబోయే ఈ సినిమా ఇప్పటి నుంచే సంచలనం అవుతోంది!
Post a Comment