'ఈగ' సినిమా తర్వాత యువ కథానాయకుడు నాని నటిస్తున్న తదుపరి చిత్రం షూటింగు జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లోఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'పైసా' అనే టైటిల్ పెడుతున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో కథానాయికగా లక్కీ శర్మ ఎంపికైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆల్ ది బెస్ట్' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ చిత్రం షూటింగు దశలో ఉండగానే కృష్ణ వంశీ సినిమాలో అవకాశం రావడం పట్ల లక్కీ శర్మ చాలా హ్యాపీగా వుంది. ఎందుకంటే, కృష్ణ వంశీ సినిమాల జయాపజయాలు ఎలా వున్నా, వాటిలో నటించే హీరోయిన్లకు మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. హీరోయిన్ ని అందంగా చూపించడంలో వంశీ శైలి అటువంటిది మరి!
Post a Comment