ప్రేమ కథా చిత్రాలని తనదైన కోణంలో ఆవిష్కరించడంలో తేజా సిద్ధహస్తుడు. తాజాగా ఆయన 'నీకు నాకు డాష్ డాష్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి ప్రేక్షకులకి విదితమే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. లిక్కర్ సిండికేట్ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రాన్ని పెద్దలు మాత్రమే చూడగల సినిమాగా భావించిన సెన్సార్ బోర్డు సభ్యులు, A సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాడిన భాష కారణంగా ... రొమాంటిక్ - యాక్షన్ సీన్స్ పరిధులు దాటిన సందర్భంగా A సర్టిఫికేట్ పొందినట్టు స్పష్టమౌతోంది. తేజా పైత్యం ఫలితమే ఇదనే గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Post a Comment