Director shankar buys rolls royce car

లగ్జరీ కార్లో తిరుగుతున్న దర్శకుడు!
తమిళ దర్శకుడు శంకర్ తదుపరి చిత్రం ఏమిటా? అని సినిమా అభిమానులు ఎదురుచూస్తుంటే, మరో విధంగా ఆయన తాజాగా వార్తల్లోకి ఎక్కారు. దీనికి కారణం, ఆయన తాజాగా కొనుగోలు చేసిన లగ్జరీ కారే! అవును... కార్లంటే మోజుపడే శంకర్ తాజాగా యూకే నుంచి రోల్స్ రాయేస్ కారును దిగుమతి చేసుకున్నారు. మూడు కోట్లు విలువ చేసే ఈ కారును చెన్నయ్, కేకే నగర్ ఆర్టీవో ఆఫీసులో ఇటీవలే రిజిస్టర్ చేయించారు. అదనపు రుసుం చెల్లించి, సంఖ్యా శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం, TN09 BQ 0008 నెంబర్ తీసుకున్నారు. సినిమా రంగానికి సంబంధించి ఈ తరహా రోల్స్ రాయేస్ కార్లు మన దేశంలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ల వద్ద మాత్రమే వున్నాయట!

Post a Comment

Previous Post Next Post