ఎప్పటి నుంచో అభిమానులను ఊరిస్తున్న రామ్ చరణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ త్వరలో జతకట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ భారీ ఎంటర్ టైనర్ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఇప్పటికే త్రివిక్రమ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. తనదైన శైలి పంచ్ డైలాగులతో సహజత్వంతో కూడిన వినోదాత్మక చిత్రాలను రూపొందించే త్రివిక్రమ్ స్టయిల్ అంటే మన హీరోలంతా ఎంతో ఇష్టపడతారు. అలాగే, రామ్ చరణ్ కూడా ఆయన దర్శకత్వంలో చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు. అది ఇప్పటికి సాధ్యపడినట్టు చెబుతున్నారు.
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్లో త్రివిక్రమ్ 'జులాయి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే, రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా, వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజక్టు చేస్తాడని అంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాత వీరి కాంబినేషన్ ని వర్కౌట్ చేస్తున్నాడు. బాబాయి కి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ అబ్బాయికి ఆ రేంజ్ హిట్ ఇస్తాడేమో చూడాలి
Post a Comment