డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ... కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సాయికుమార్. ఈ మధ్య ఆయన అడపాదడపా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే, టీవీ చానల్స్ లో రియాలిటీ షోస్ లోనూ కనిపిస్తునారు. ప్రస్తుతం ఆయన 'ఆటోనగర్ సూర్య' లో సమంతా తండ్రి పాత్రకి ఎంపికయ్యారు. నాగ చైతన్య - సమంతా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయవాడ ఆటోనగర్ నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. 'ప్రస్థానం' సినిమాలో తనకి దేవకట్టా మంచి పాత్రని ఇచ్చారనీ ... అలాగే ఈ సినిమాలోనూ తనకి సమంతా తండ్రి గా గొప్ప పాత్రని ఇచ్చాడని సాయికుమార్ అన్నారు. ప్రస్తుతం తాను 'ఊకొడతారా ... ఉలిక్కి పడతారా' ... 'ఎవడు' సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు.

Post a Comment