![]() వివాదాలతో నిత్యం సావాసం చేసే రాంగోపాల్ వర్మ తాజాగా గ మరో సంచలనం సృష్టించడానికి సిద్దం అయ్యాడు యదార్ధ సంఘటనలను తెరకెక్కించడంలో రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు.రక్తచరిత్ర లాంటి సినిమా లు ఇందుకు ఉదాహరణ జయాపజయాలతో పని లేకుండా ఆయన ఈ పని చేసుకుంటూ వెళుతుంటాడు. ఇప్పుడదే తరహాలో ముంబై లోని హోటల్ తాజ్ పై గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిని 'ది అటాక్స్ ఆఫ్ 26 / 11 ' గా ... ఆయన తెరకెక్కిస్తున్నారు. అప్పటిలో సంఘటన స్థలానికి కూడా రాము వెళ్లారు ఈ సినిమా షూటింగ్ ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించిన ఆయన, ఇందుకు సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. దేశ చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన ఓ సంఘటనని తెరకెక్కిస్తోన్న ఈ రోజు, తన కెరియర్లో మరింత ప్రాముఖ్యతని సంతరించుకున్నరోజని రామగోపాల్ వర్మ అన్నారు. ఈ సంఘటనకి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించడంలో తనకి సహకరించిన అధికారులకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముంబై లోని తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడి జరగడానికి ముందు ... తరువాత పరిస్థితులను ఈ సినిమాలో చిత్రీకరించడం జరుగుతుందని చెప్పారు. అచ్చు 'కసబ్' లా వుండే వ్యక్తి కోసం ఎంతగానో గాలించామనీ ... సంజీవ్ జైస్వాల్ అనే స్టేజ్ ఆర్టిస్ట్ ను ఆ పాత్రకి ఎంపిక చేశామని అన్నారు. అంతర్జాతీయంగా ఈ సినిమాని విడుదల చేయాలనే ఉద్దేశంతో 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో భారి బడ్జట్ సినిమా అని చెప్పవచ్చు వర్మ ప్రెస్ నోట్ మీ కోసం CLICK HERE FOR PRESSNOTE | ||||
Post a Comment