Akhil Grand Launching in Rajamouli Direction?

? 
బుడిబుడి నడకల బుడతడిగా ఉన్నప్పుడే వెండితెర మీద సంచలనం క్రియేట్ చేసాడు అఖిల్. 'సిసింద్రీ' సినిమా ద్వారా అప్పట్లోనే ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడీ కుర్రాడికి పదిహేడేళ్ళు. అటు క్రికెట్లోనూ, ఇటు సినిమాలలోనూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అఖిల్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఓ గుడ్ న్యూస్. తన పుత్రరత్నాన్ని ఓ గ్రేండ్ ప్రాజక్ట్ ద్వారా ఇంట్రడ్యుస్ చేయడానికి నాగార్జున, అమల ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ ని లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
ఆ మధ్య 'రాజన్న' చిత్రం డిస్కషన్స్ సందర్భంగా నాగ్ ను రాజమౌళి ఎక్కువగా కలవడం జరుగుతోంది. ఆ సందర్భంగా నాగ్ రాజమౌళిని అడిగినట్టు, ఆయన కూడా అఖిల్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అఖిల్ ప్రస్తుతం టీనేజ్ లో ఉన్నందున అందుకు తగ్గట్టుగా లవ్ స్టోరీని తయారుచేయనున్నట్టు తెలుస్తోంది. లవ్ స్టోరీలలోనే మునుపెన్నడూ రాని విధంగా, ఓ భారీ చిత్రంగా దీనిని నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న 'ఈగ', పూర్తయ్యాక అఖిల్ ప్రాజక్టును చేబడతారు. సో... అక్కినేని వంశం నుంచి మరో హీరో త్వరలో వెండితెరకు వేంచేయనున్నాడన్న మాట! ఈ సినిమా లో హీరొయిన్ గ శ్రీదేవి కూతురి పరిచయమవుతున్నట్లు సమాచారం 

Post a Comment

Previous Post Next Post