ఈమధ్య కాలంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఫ్రెండ్షిప్ బాగా బలపడినట్టు కనిపిస్తోంది. 'బాద్ షా' సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి చరణ్ హాజరు కావడం ... చరణ్ హీరోగా చేస్తోన్న 'ఎవడు' సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పేందుకు సిద్ధపడటం... వారి మధ్య సఖ్యతకి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రామ్ చరణ్ దగ్గర ప్రస్తావిస్తే ... ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ ... కాకపోతే అందుకు తగిన కథ కుదరాలని ఆయన చెప్పారు. చరణ్ అభిప్రాయం పట్ల ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో తెలియదుగానీ, అటు అతని అభిమానులు ... ఇటు చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ పరిశీలకులు మాత్రం వీరి కాంబినేషన్లో సినిమా రావడానికి మరెంతో కాలం పట్టదని అంటున్నారు. ఈ కాంబినేషన్లో త్వరలో రావాలి అని కోరుకుందాం అల్ ది బెస్ట్ తో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్

إرسال تعليق