మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా ఫార్ములాతో పవన్ కళ్యాణ్ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ సేమ్ ఫార్ములా ఉపయోగించి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అసలు ఈ ఫార్ములా ఏమిటంటే….అతి తక్కువ కాలంలో సినిమాను పూర్తి చేయడమే. బిజినెస్ మేన్ చిత్రాన్ని చాలా తక్కువ కాలంలో మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసి ప్రొడక్షన్ కాస్ట్ చాలా వరకు తగ్గించి నిర్మాతకు ఇతర పెద్ద సినిమాలతో పోలిస్తే రోజు రూ. 7 లక్షల వ్యయం చొప్పున తగ్గించాడు.
పవన్ కళ్యాణ్‌తో రూపొందించబోయే ‘కెమెరామెన్ గంగతో రాబాబు’ చిత్రాన్ని కూడా అదే ఫార్ములాతో తీసి నిర్మాతను సేవ్ చేయాలని, అదే విధంగా చాలా కాలంగా విజయానికి మొహం వాచిపోయిన పవన్ స్టార్‌లో ఎనర్జీ నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. కథ, స్క్రిప్టు ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్న పూరి అక్టోబర్ 18న సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు కూడా. మరి బిజినెస్ మేన్ సినిమా ఫార్ములా….పవన్ కళ్యాణ్‌కు పనిచేస్తుందా? లేదా? అనేది త్వరలోనే తేల నుంది.
పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పూరి జగన్నాథ్
Post a Comment