బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య? NAGACHITANYA IN BOYAPATI DIRECTION

  ప్రస్తుతం యన్టీఆర్ తో 'దమ్ము' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. చైతన్యకు సూట్ అయ్యే కథను బోయపాటి రెడీ చేశాడనీ, చైతన్య కూడా ఆ సబ్జెక్ట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాడనీ తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్లోనే అతి పెద్ద బడ్జెట్ తో ఈ చిత్ర నిర్మాణాన్ని చేబట్టడానికి ఓ ప్రముఖ నిర్మాత ముందుకు వచ్చాడట. ఇటీవల వచ్చిన దడ బెజవాడ ల తో ఫ్లాపుల్లో వున్న నాగచైతన్య ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్యా' చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే, రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రాన్ని కూడా అతను చేయాల్సివుంది. ఆ సినిమా ల తరువాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది అని సమాచారం 

Post a Comment

Previous Post Next Post