'మున్నీ బద్నాం హుయీ...' అంటూ ఆమధ్య 'దబాంగ్' సినిమాలో హొయలుపోయిన మలైకా అరోరా ఖాన్, ఆ ఒక్క పాటతో మొత్తం దేశాన్నే ఊపేసింది. ఇప్పుడీ సెక్సీ భామ మహేష్ బాబు సరసన ఓ సినిమాలో నటించనుందనే వార్త టాలీవుడ్ లో షికారు చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ కథానాయకుడుగా నటించే సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయడానికి మలైకాను ఎంపిక చేశారట. మామూలుగా సుకుమార్ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్ అనేది వుంటుంది. ఆ పాట విషయంలో సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటూ ఉంటాడు. అలాగే, మహేష్ నటించే సినిమాలో కూడా ఐటెం పాటను భారీ రేంజ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే, క్రేజ్ గా వుండడం కోసం మలైకాను తీసుకుంటున్నారని అంటున్నారు. అన్నట్టు, గతంలో మహేష్ బాబు నటించిన 'అతిధి' సినిమాలో 'రాత్రైన నాకూ ఓకే... పగలైన నాకూ ఓకే' అంటూ సాగే ఐటెం పాటలో మహేష్ తో కలిసి మలైకా నర్తించిన సంగతి అభిమానులకి గుర్తుండే వుంటుంది! | ||||

Post a Comment