తెలుగు సినిమా హీరొయిన్ లు కొంత మంది వేశ్య పాత్ర ల మీద మనసు పారేసుకుంటున్నారు నిన్న అనుష్క నేడు ఛార్మి తను తదుపరి చిత్రం లో వేశ్య పాత్ర పోషిస్తోంది తెరపై వేశ్య పాత్రలకంటూ ఓ ప్రత్యేకత ... ప్రాధాన్యత వున్నాయి. ఈ పాత్రలో నటించి మెప్పించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అసలైన నటనకు ఛాన్స్ వుండడం వాళ్ళ చాలామంది కథానాయికలు ఈ పాత్రని చేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. ఇప్పుడదే కోవలో ఛార్మీ కూడా చేరిపోయింది. చందు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో ఆమె ఈ పాత్రని పోషించనుంది. గతంలో 'టెన్త్ క్లాస్' ... 'నోట్ బుక్' వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న చందు, ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఓ రచయితకీ ... గాయకుడికి ... వేశ్యకి మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు చందు చెబుతున్నాడు. వేశ్య పాత్రలో ఛార్మి నటిస్తారనీ ... రచయిత - గాయకుడు పాత్రలకి కొత్తవారిని ఎంపిక చేయనున్నామని అన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలౌతుందని చెప్పాడు. 'చాందినీబార్'లో టబూ ... 'చమేలి'లో కరీనాకపూర్ ...'వేదం'లో అనుష్క దూల్ పెట్ సినిమా లో స్నేహ వేశ్యలుగా నటించి అందరి ఆదరాభిమానాలను సంపాదించారు. ఆ ఉద్దేశంతోనే ఈ పాత్రని అంగీకరించిన ఛార్మీకి, ఆ స్థాయి గుర్తింపు లభిస్తుందా? అనేది చూడాలి!

Post a Comment