నాగార్జున - అనుష్క జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ పై 'ఢమరుకం' సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సోషియో ఫాంటసి చిత్రం కోసం నాగార్జున అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిక వాళ్ల నిరీక్షణ ఫలించబోతోంది. స్పెషల్ ఎఫెక్ట్స్ కీ ... గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసిన ఈ సినిమా ఆడియో ని , ఏప్రిల్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఆటో డ్రైవర్ పాత్రని పోషిస్తున్నప్పటికీ ... కథాపరంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారట.
పశ్చిమ గోదావరి జిల్లా యాసలో నాగార్జున మాట్లాడే తీరు ఆ పాత్రకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ ... ఆయన నటనలోని వైవిధ్యం మాస్ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకముందని చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాలో, ప్రకాష్ రాజ్ ... ప్రదీప్ రావత్ ... సోనూసూద్ ... బ్రహ్మానందం ... ఎమ్మెస్ ...అలీ ... తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Post a Comment