SRIKANTH IN NAGARJUNA SHIRIDI SAI MOVIE నాగార్జున షిరిడి సాయిలో శ్రీకాంత్


భక్తి రస సినిమాలు చేయడం లో కింగ్ నాగర్జున కి ఒక శైలి వుంది ఇప్పుడు తాజాగా    నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ భక్తిరస చిత్రం షిరిడి సాయి. ఈనెల 2 నుంచి కర్నాటకలో ఓ గ్రామంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెలాఖరు వరకు జరిగే షూటింగ్ తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చి 1 నుంచి 15 వరకు కులుమనాలిలో రెండో షెడ్యూల్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు. గతంలో నాగార్జున, శ్రీకాంత్ కలసి నిన్నే ప్రేమిస్తా చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జునతో కలసి నటిస్తున్న షిరిడి సాయి చిత్రంలో శ్రీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

Post a Comment

Previous Post Next Post