Ramuda Krishnuda Title Look Launched

ఆసక్తికరంగా ‘’రాముడా క్రిష్ణుడా" టైటిల్ లుక్ 




బేబి డమరి సమర్పణ. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సుమన్ బాబు హీరోగా దర్శకత్వం వహిస్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘’రాముడా క్రిష్ణుడా". భార్య భర్తని అర్థం చేసుకుంటే సంసారం స్వర్గం అవుతుంది. చెప్పుడు మాటలు - నమ్మి భర్తని అనుమానిస్తే రాముడు కూడా క్రిష్ణుడిలా రాసలీలల్లో తేలుతాడు అనే కథ ప్రధాన ఇతివృత్తంగా ఈ సౌత్ ఇండియన్ సినిమా తెరెక్కుతోంది. వృత్తిని, ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని సతమతం అయ్యే  హీరో పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. తానే హీరో గా నటిస్తూ సుమన్ బాబు దర్శకత్వం కూడా వహిస్తున్న ఈ సినిమాకు రాముడా కృష్ణుడా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ కథను ఆసక్తికరంగా అందరిని ఆకట్టుకునే విధంగా ప్రతి కుటుంబాన్ని కదిలించే హస్యభరిత చిత్రంగా మరియు యాక్షన్ ఫ్యామిలీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, నెల్లూరులో షుటింగ్ జరుగుతుందని డైరెక్టర్ కం హీరో సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో వర్ష విశ్వనాథ్, మిస్ నెల్లూరు వర్షిత చౌదరి, రఘుబాబు, షవర అలీ, హైపర్ ఆది, నవీనా రెడ్డి. అలోక్ జైన్, గౌతమి ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందింది. 

రచన: మురళిరమేష్. 

DOP చందు, 

మ్యూజిక్: రాప్ రాక్ షకీల్, 

ఎడిటర్: వెంకట్ ప్రభు, 

స్టంట్స్ : నందు - దేవరాజ్

 కాస్టుమ్: డిజైనర్ :రవళి

ఆర్ట్ : నాని,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : Avm మురళి 

లైన్ ప్రొడ్యూసర్: అబ్దుల్ అబ్దుల్ రెహమాన్

 నిర్మాణం:  శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ 

హీరో- దర్శకత్వం: సీహెచ్. సుమన్ బాబు.

Post a Comment

Previous Post Next Post