Home » » #mentoo Fun will Entertain on 26th

#mentoo Fun will Entertain on 26th

 ‘#మెన్ టూ’ మే 26న మీ ముందుకు వ‌స్తోంది.. ఫ‌న్‌ని ఎంజాయ్ చేస్తారు :  బ్ర‌హ్మాజీ




నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మే 26న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...


కో ప్రొడ్యూస‌ర్ శ్రీమాన్ మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ ఎక్స్‌ట్రార్డిన‌రీ మూవీ. స్క్రీన్ ప్లే కూడా చ‌క్క‌గా కుదిరింది. సెన్సిటివ్‌గా ఉంటుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకు ప‌ని చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. 


కౌశిక్ మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ మే 26న రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మగవాళ్ల కష్టాలపై ఫన్నీగా ఈ మూవీ ఉంటుంది. ప్రేక్ష‌కులు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


ప్రియాంక శర్మ మాట్లాడుతూ ‘‘మే 26న మా ‘# మెన్ టూ’ మూవీ రిలీజ్ అవుతుంది. యూత్‌కి క‌నెక్ట్ అయ్యే మూవీ. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మీ కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌తో క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. మా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ చిత్రంలో మేం ఎక్క‌డా ఆడ‌వాళ్ల‌ని తిట్ట‌లేదు. సినిమా ఇంత బాగా రావ‌టానికి నిర్మాత‌లు, మౌర్యనే కార‌ణం. అమ్మాయిల‌కు కూడా సినిమా న‌చ్చుతుంది. మే 26న  సినిమా చూసిన త‌ర్వాత మీకే అర్థ‌మ‌వుతుంది. మాకంతా కాన్ఫిడెంట్‌గా ఉంది. మా టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ‘‘మా సినిమా ఇంత దూరం రావ‌టానికి కార‌ణం మైత్రీ మూవీస్ సంస్థ‌వాళ్లు. వారు మా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. మే 26న సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు క‌చ్చితంగా సినిమా గురించి మాట్లాడుతాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మా టీమ్‌కి, టెక్నీషియ‌న్స్ అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు.  హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొదిన ఈ సినిమాను అంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


న‌రేష్ అగ‌స్త్య మాట్లాడుతూ ‘‘ముందుగా మైత్రీ సంస్థకి థాంక్స్. డిస్ట్రిబ్యూష‌న్ తీసుకున్నారు. వీరితో పాటు పాటు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌క‌పోతే మేం ఇక్క‌డ నిలిచేవాళ్లం కాదు. మ‌త్తు వ‌ద‌ల‌రా మూవీ చూసి మౌర్య ఈ సినిమాకు న‌న్ను సెల‌క్ట్ చేసుకున్నాడు. త‌న‌కు థాంక్స్‌. శ్రీకాంత్‌, కార్తీక్‌, మౌర్య‌, ఎలిషా అంద‌రికీ ఇది తొలి సినిమా. మేం చాలా న‌మ్మ‌కంతో ఉన్నాం. బ్ర‌హ్మాజీగారు అందించిన స‌పోర్ట్‌కి థాంక్స్‌. సెన్సిబుల్‌గా చేసిన సినిమా చేశాం. మే 26న మూవీ చూసిన వారంద‌రూ బావుంద‌నే అంటారు’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీలో నాకొక ట్రాక్ రికార్డ్ ఉంది.. ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్స్ అంద‌రి తొలి సినిమాలో నేను న‌టించాను. ఆ లెక్క‌లో ఈ సినిమా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ల‌క్కీ అనే చెప్పాలి. ఒక ఫ‌న్నీ కాన్సెప్ట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌గ‌వాళ్లు దుర్మార్గులు అని చెప్పి అంద‌రూ సినిమాలు తీశారు. నాకు తెలిసి ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్ల‌ని ఎంత టార్చ‌ర్ పెడ‌తార‌ని ప్రపంచంలో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ సినిమా తీయ‌లేదు. ఇదే ఫ‌స్ట్ టైమ్‌. అస‌లు ఏ విధంగా టార్చ‌ర్ పెడ‌తార‌నేది ఈ సినిమా చూసి తెలుసుకోవ‌చ్చు. అలాగ‌ని ఇది వ‌న్ సైడెడ్ మూవీ కాదు. ఇద్ద‌రి వైపులా ఉండే స‌మ‌స్య‌ల‌ను చూపిస్తున్నాం. అన్నింటినీ చ‌క్క‌గా డీల్ చేశాడు మా డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌. అంద‌రూ యువ‌కులే. అందుక‌నే నావంతు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చాను. మే 26న వ‌స్తుంది. ఫ‌న్‌ని ఎంజాయ్ చేస్తారు ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నా’’ అన్నారు. 




న‌టీన‌టులు:


నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు  


సాంకేతిక వ‌ర్గం:


బ్యాన‌ర్:  లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్

నిర్మాత‌:  మౌర్య సిద్ధ‌వ‌రం

కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి

ద‌ర్శ‌క‌త్వం:  శ్రీకాంత్ జి.రెడ్డి

మ్యూజిక్‌:  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌

సినిమాటోగ్ర‌ఫీ:  పి.సి.మౌళి

ఎడిట‌ర్‌:  కార్తీక్ ఉన్న‌వ‌

పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి

ఆర్ట్‌:  చంద్ర‌మౌళి.ఇ

కో డైరెక్ట‌ర్‌:  సుధీర్ కుమార్ కుర్రు

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా



Share this article :