Home » » Producer Vivek Kuchibhotla Launched Veda Song

Producer Vivek Kuchibhotla Launched Veda Song

 ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదగా "వేద" చిత్రం నుండి "పుష్ప పుష్ప" వీడియో సాంగ్ విడుదల



ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ "వేద"


ఇటివలే కార్తికేయ, ధమాక వంటి హిట్ చిత్రాలకు నిర్మాణ బాగస్వామైన వివేక్ కూచిబొట్ల కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన "వేద" చిత్రంలోని పాటను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

మొన్న డిసెంబర్ కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన "వేద" సినిమాను *కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్* పతాకంపై రాధాకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంది. 

ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని భావిస్తున్నాను. 


కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.

ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. 


ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి  9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు . 

కంచి *కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్* ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్స్ ను ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలానే ఈ సినిమా గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 


ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ  యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది.శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. 


నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష

నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్

సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్

ఎడిటర్: దీపు ఎస్ కుమార్ 

సంగీతం: అర్జున్‌జన్య

పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు

డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం


Share this article :