Home » » Versatile Actor Sarathkumar in Nbk108

Versatile Actor Sarathkumar in Nbk108

 నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 లో వెర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్



గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ ఇటివలే భారీ యాక్షన్ బ్లాక్ తో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో భారీ సెట్ నిర్మించారు.


షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడిల లొకేషన్ స్టిల్ విడుదల చేశారు. ప్రస్తుతం  #NBK108 రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.


బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు.


ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.


#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు.


తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, శరత్ కుమార్


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ

బ్యానర్: షైన్ స్క్రీన్స్

సంగీతం: ఎస్ థమన్

డీవోపీ:  సి రామ్ ప్రసాద్

ఎడిటర్: తమ్మి రాజు

ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్

ఫైట్స్: వి వెంకట్

పీఆర్వో వంశీ-శేఖర్


Share this article :